Have a nice day!

కోటంరెడ్డి Vs కాకాణి: అసలు పంచాయితీ ఇదే.. నా లెక్క నాగ్గావాలే!

కోటంరెడ్డి, కాకాణి మధ్య కోల్డ్ వార్: ఇదే అసలు గొడవ!

0 12

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ప్రభుత్వ అధికారి, ఎంపీడీవో ఇంటిపై దాడి చేయడం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొదట ఆయనపై కేసు పెట్టడానికి కూడా భయపడిన పోలీసులు సీఎం జగన్ ఆదేశాలతో ఏదో చిన్న సెక్షన్లు కింద తెల్లవారుజామున అరెస్ట్ చేసేశారు. అయితే.. ఇప్పుడు.. మెల్లగా అసలు విషయం బయటకు వస్తుంది.

ఓ లేఔట్‌కు పర్మిషన్ విషయంలోనే ఈ గొడవ.. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండే ఓ లేఔట్ కు పర్మిషన్ ఇప్పించి తద్వారా వచ్చే ప్రతిఫలాన్ని తానే తీసుకోవాలనేది కోటంరెడ్డి ఆలోచన. అయితే మా నియోజకవర్గంలో వ్రేలు పెడుతావా? అంటూ కాకాణి కోటంరెడ్డికి చెక్ పెట్టాలని కాకాణి అనుకున్నాడు. కాకాణి గోవర్ధన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో రియల్ ఎస్టేట్ లే ఔట్‌కు ఎంపీడీవో పర్మిషన్ ఇవ్వలేదు.

ఈ క్రమంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో నివసించే మండల ఎంపీడీవో ఇంటికి వెళ్లి అధికార పార్టీ జులుం ప్రదర్శించేశాడు. అంతేనా కరెంటు పీకేశాడు.. వాటర్ ఆపేశాడు.. తాగొచ్చి బెదిరించేశాడు. ఈ విషయాన్ని ఎంపీడీఓ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, కోటంరెడ్డి కరెంటు పీకించడం, ఎంపీడీఓని ఇబ్బంది పెట్టడం గురించి తెలుసుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి అవన్నీ మళ్లీ వాళ్లకు వచ్చేలా చేయించాడు. అంతేకాదు పోలీస్ స్టేషన్ కు పంపించి కేసులు కూడా పెట్టేలా చేశాడు. ఈ విషయాన్ని కోటంరెడ్డే మీడియా ముందు వెల్లడించారు కూడా..

అసలు ఆ లేఔట్ కూడా వైసీపీ నాయకుడిదే. కానీ ఎమ్మెల్యే కాకాణి మాత్రం అప్రకటిత లెక్కల ప్రకారం.. లేఔట్‌కి ఎంత చెల్లించాలో.. అంత మొత్తం.. తనకే చెల్లించాలని పట్టు బట్టాడట. అయితే సదరు వైసీపీ నేత కమ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కోటంరెడ్డికి సన్నిహితుడు అవడంతో నేను చూసుకుంటాలే అని అభయం ఇచ్చేశాడు.

అయితే అందుకు కాకాణి మాత్రం ఒప్పుకోలేదు. నాది నాకు రావాల్సిందే ఎన్నికలకు ఖర్చు పెట్టుకున్నప్పుడు మీరేమైనా ఇచ్చారా? అంటూ గట్టిగానే అన్నాడట. ఈ క్రమంలో ఎంపీడీవోను బెదిరిస్తే పనైపోతుందని భావించిన కోటంరెడ్డి ఆవేశపడ్డాడు. అయితే పని పూర్తి కాకపోగా కేసులో ఇరుక్కున్నాడు.

Leave A Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.