Have a nice day!

అమ్మ జగనూ.. భలే ఇరికించావుగా..!!

కేసిఆర్ ను ఇరకాటంలో పెట్టిన జగన్

0 28

తెలుగు రాష్ట్రాలు అనగానే ఒక రాష్ట్రంలో పాలనను ఇంకో రాష్ట్రంలో పాలనతో ఎప్పుడూ పోలుస్తూనే ఉంటారు. ఒక రాష్ట్రంలో పరిపాలన సంక్షేమ పథకాలు, కీలక నిర్ణయాలు ఇంకో రాష్ట్రంపై కచ్చితంగా ప్రభావం చూపుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఇరికించినట్లుగానే ఉంది.

నిజమే, అసలు విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఇది ఇప్పటికిప్పుడు ఎదురైన పరిస్థితి కూడా కాదు. ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వాలు ఈ నష్టాలను భర్తీ చేసేందుకు వందల కోట్ల రూపాయలను ఆర్టీసీకి కేటాయిస్తూ వస్తున్నాయి. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం అధికారంలోకి రాగానే ఆర్టీసీని కాకుండా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపేశారు. ఇక్కడే తెలంగాణ సీఎం కేసిఆర్ ఇరుకున పడిపోయారు.

ఆర్థికంగా కాస్త వెనకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటువంటి కీలక నిర్ణయం జగన్ తీసుకోగా.. ధనిక రాష్ట్రం అని చెబుతున్న తెలంగాణలో ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోట్లేదు. అనే డిమాండ్ తో రోడ్లు ఎక్కేశారు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు. ఏపీలోలాగానే తమనూ ప్రభుత్వంలో కలిపేయాలనే ప్రధాన డిమాండ్‌తో దసరా పండుగకు సరిగ్గా ముందే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిపోయింది.

తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ ను ఒప్పుకోవట్లేదు. ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ లకు ఒప్పుకుంటే.. రేపు తెలంగాణలో ఆటోడ్రైవర్లు, కార్ డ్రైవర్లు ఏడాదికి రూ.10వేలు ఇవ్వమంటారు. అలాగే అమ్మఒడి పథకం.. ఇలా ప్రతీ ఒక్కదానికి డిమాండ్ లు వస్తాయి. ఏపీలో అమలయ్యే పథకాలు అన్నీ తమకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తే ప్రమాదం అని కేసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో తీసుకునే నిర్ణయాల వంటివి తెలంగాణలో తీసుకోకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఎత్తులు, వ్యూహాలు వేయడంలో జగన్ తో పోల్చుకుంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ అనుభవం చాలా తక్కువ. అలాంటిది జగన్ దెబ్బకు కేసిఆర్ ఇరుక్కోవడం ఇప్పుడు రాజకీయంగా కూడా కొన్ని మార్పులకు కారణం కావచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తే కూడా జగన్ వల్లే కేసిఆర్ చేశారని, అందువల్ల రాజకీయంగా వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ అని టీఆర్ఎస్ భావిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.